తెలంగాణ

డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ.. తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ జరిగింది. పదిమంది నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. నిరుద్యోగుల తరఫున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదించారు. నోటిఫికేషన్‌కు.. పరీక్షకు మధ్య 4 నెలల సమయం మాత్రమే ఇచ్చారన్నారు. ఈ నాలుగు నెలల వ్యవధిలో పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు అనేక ఆందోళనలు చేశారని రవిచందర్ తెలిపారు. గ్రూప్ 1 పరీక్షను కూడా ఇదే రీతిలో నిర్వహించి అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారన్నారు. నిరుద్యోగులు ఈ నాలుగు నెలల వ్యవధిలో అనేక పరీక్షలు రాశారన్నారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని.. జూన్ 3న టెట్ పరీక్షలు నిర్వహించారన్నారు.

Also Read : అక్క భర్తను లవ్ చేసిన యువతి.. వద్దని చెప్పిన తల్లిదండ్రులు..చివరకు!!!

ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేర్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. పదిమంది కోసం 2.45 లక్షల మంది నిరుద్యోగులను బలి చేయలేమని పేర్కొన్నారు. టెట్ పరీక్షకు డీఎస్సీకి దాదాపు నాలుగు నెలల సమయం ఉందన్నారు. పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారన్నారు. పిటిషన్ వేసిన పదిమంది డిఎస్సీ ఎగ్జామ్కు అప్లై చేశారా? అనిహై కోర్ట్ ప్రశ్నించింది. గ్రూప్ 1 తో పాటు డిఏవో పాటు డీఎస్సీ కి అప్లై చేశారని పిటిషనర్ల తరుఫు న్యాయవాది వెల్లడించారు. డీఎస్సీ హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. పదిమంది పిటిషన్ వేసి ఒకరు కూడా డీఎస్సీ హాల్ టికెట్ ను ఎందుకు సబ్‌మిట్ చేయలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణ ఆగస్టు 28కి హైకోర్టు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి : 

  1. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీకవిత జ్యుడిషియల్ కస్టడీ?
  2. ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు.. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోని 30 వేలకు పైగా అభ్యర్ధులు!!
  3. కేసీఆర్ మెప్పుకోసమే ఈ ప్రోటోకాల్ డ్రామా.. కాంగ్రెస్ నేతలు
  4. సైబర్ నెరగాళ్ళ లింకు ఓపెన్ చేశారో…. ఎకౌంట్లో పైసలు మాయం….
  5. యూనియన్ బ్యాంకు మేనేజర్ అజయ్ ఘరానా మోసం..!

Back to top button