
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రం లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అందరూ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయాన్ని సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీతపై భారీ మెజారిటీతో జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండాని ఎగరవేశారు. ఏకంగా 25 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ తొలిసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవబోతున్నారు. గతంలో ఈ నియోజకవర్గంలోనే నవీన్ యాదవ్ రెండుసార్లు పోటీ చేసి ఓడిపోగా ఈసారి ఉప ఎన్నికలలో గెలిచి చరిత్ర సృష్టించారు. అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దగ్గర దగ్గరగా 50వేల ఓట్లు సాధించారు. ఇక బిజెపి దగ్గర దగ్గరగా 12,000 ఓట్లు సాధించారు.





