ఝార్ఖండ్‌లో ఎన్డీయేదే హవా అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.బీజేపీ నేతృత్వంలోని కూటమికే పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్ ఎన్డీయేకు 46-58 సీట్లు, ఇండియా కూటమి 24-37 స్థానాలు, ఇతరులకు 6-10 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే 42-47 సీట్లు, ఇండియా కూటమి 25-30 సీట్లు, ఇతరులు 1-4 సీట్లు వస్తాయని తేలింది. టైమ్స్ నౌ-జేవీసీ: ఎన్డీయేకు 40-44, ఇండియా కూటమికి 20-40, ఇతరులు ఒక్క స్థానంలో గెలుపొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే 25, ఇండియా కూటమి 53, ఇతరులు 3 స్థానాలు దక్కుతాయని అంచనా వేశారు. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ సైతం ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని తేల్చింది. ఎన్డీయే 37-40 సీట్లు ఇస్తే.. ఇండియా కూటమి 36-39, ఇతరులు 0-2 స్థానాలు దక్కుతాయని తెలిపింది. ఝార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలుండగా మెజార్టీ మార్కు 41.
156 Less than a minute