Monday, February 23, 2026
Homeఆంధ్ర ప్రదేశ్చంద్రబాబును కలిశాకా పవన్ పై మందకృష్ణ సీరియస్

చంద్రబాబును కలిశాకా పవన్ పై మందకృష్ణ సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ సంగతి తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కేవలం కాపులకు మాత్రమే పెద్దన్న అంటూ హాట్ కామెంట్స్ చేశారు మందకృష్ణ మాదిగ. అయితే సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత మందకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.

విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో దాదాపు గంట సేపు చర్చలు జరిపారు మంద కృష్ణ మాదిగ. అనంతరం మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగానే పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మందకృష్ణ. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నోటి నుంచి ఆ విధంగా రావడం దురదృష్టకరమన్న మంద కృష్ణ.. మాదిగ మహిళ అనితను అవమానిచినట్లే కదా అని అన్నారు.ఈ విషయాన్ని తాము దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారు.

ఎన్నికల సమయంలోనే పవన్ పట్ల తాము అసంతృప్తిని వ్యక్తం చేశామన్నారు మందకృష్ణ మాదిగ. పవన్ కళ్యాణ్ ‌కాపులకు పెద్దన్న‌ఏమో కాని మాదిగలకు కాదన్నారు. మాదిగలకు జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదన్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇస్తే దళితుడికి ఇవ్వలేదన్నారు. పవన్ కళ్యాణ్‌ తన శాఖ సరిగా చేయలేదని ఇంకో మంత్రి అంటే ఎలాగా‌ వుంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ను నీ శాఖను నేను తీసుకుంటానని మరొక మంత్రి ఎంటే ఎలా ‌వుంటుందని నిలదీశారు. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టమన్నారు. లా‌ అండ్ ఆర్డర్ ఫెయిల్‌ అంటే సిఎం చంద్రబాబును అన్నట్లు కాదా అని మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు చదవండి ..

RELATED ARTICLES

Most Popular

Recent Comments