తెలంగాణ

గవర్నర్ గా కేసీఆర్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :  తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరగనున్నాయని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందని సమాచారం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బిజేపీలో బిఆర్ఎస్ విలీనం పై కీలక వాఖ్యలు చేశారు. బిజెపిలో బిఆర్ఎస్ విలీనం జరగడం ఖాయమన్నారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కుసెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ పదవులు వస్తాయన్నారు.

Read More : ఫోన్ పేతో కరెంట్ బిల్.. దిగొచ్చిన రేవంత్ సర్కార్

నలుగురు రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బిఆర్ఎస్ కు ఉన్నారని.. వారంతా బీజేపీలో విలీనం అవుతారన్నారు. వాళ్ళ విలీనంతో కవితకు బెయిల్ వస్తుందన్నారు. గులాబీ నేతలు ఎంతగా ఖండించినా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం తధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ దిశగా ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో మూడు రోజులు ఉన్న కేటీఆర్, హరీష్ రావు.. విలీనంపై బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని తెలిపారు.

Back to top button