Tuesday, February 24, 2026
Homeతెలంగాణగణేష్ లడ్డూ వేలం పాడుతూ యువకుడు మృతి

గణేష్ లడ్డూ వేలం పాడుతూ యువకుడు మృతి

హైదరాబాద్ లో విషాదం జరిగింది. గణేష్ నిమజ్జనోత్సవంలో ఊహించని ఘటన జరిగింది. మణికొండ అల్కాపూరి కాలనీ లో జరిగిన ఈ విషాద ఘటన అందరిని షాకింగ్ కు గురి చేసింది.

అల్కాపూరి టౌన్ షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా చనిపోయారు.15 లక్షల వరకు లడ్డు వేలం‌ పాట పాడాడు శ్యామ్. గణనాథుడి మండపం వద్ద నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. అంతలోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ శ్యామ్ ప్రసాద్ గుండె పోటుతో మృతి చెందాడు.

ఆదివారం రాత్రి అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపయ్యను నిమజ్జనం చేశారు. శోభాయాత్రకు నుందు లడ్డూ వేలం వేశారు. లడ్డు వేలం పాటలో ఉత్సాహంగా పాల్గొన్నారు శ్యామ్ ప్రసాద్. గణనాథుడి మండపం వద్ద చాలా సేపు నృత్యాలు చేశారు శామ్. లడ్డు కైవసం చేసుకున్న తన స్నేహితుడి ముందు తీన్ మార్ స్టేప్పులు వేశారు. అంతలోనే కుప్పకూలిపోయారు శామ్. వెంటనే హాస్పిటల్ కు తరలించినా అప్పటికే చనిపోయాడు. గుండె పోటు రావడంతో శ్యామ్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక మరణంతో అల్కాపురి కాలనీలో తీవ్ర విషాదం అలుముకుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments