Monday, February 23, 2026
Homeతెలంగాణగణేష్ నిమజ్జనంలో దళితులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుల దాడి!

గణేష్ నిమజ్జనంలో దళితులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుల దాడి!

ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. గణేష్ నిమజ్జనంకు వెళ్తున్న దళితులపై దాడికి పాల్పడ్డారు.సరూర్ నగర్ చెరుకు తోట కాలనీలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘర్షణకు దిగాడు ఎమ్మెల్యే అనుచరుడు రఘువీర్ రెడ్డి.గణేష్ నిమజ్జనం సందర్బంగా వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్తున్న భక్తులపై మన్సురా బాద్ డివిజన్ BRS నేత జక్కిడి రఘువీర్ రెడ్డి మరియు అతని అనుచరులు దాడి చేశారు. మహిళలు అని కుడా చూడకుండా చితకబాదారు రఘువీరారెడ్డి అతని అనుచరులు.

పోలీసులకు రాత్రి ఫిర్యాదు చేసిన రఘువీర్ రెడ్డిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు దళిత సంఘాలు. తక్షణమే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మాల మహానాడు నేత బేర బాలకిషన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో బైఠాయించారు. గతంలో ఎమ్మెల్యే అండతో అరాచకాలకు పాల్పడ్డారు జక్కిడి రఘువీర్ రెడ్డి. ఎల్బీనగర్ లో గతంలో కేసు నమోదు అయిన రఘువీర్ రెడ్డి పై సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments