క్రీడలు

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. 100 రూపాయలకే టికెట్లు!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026 సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ మన భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ టి20 వరల్డ్ కప్ మ్యాచ్లకు ₹100 టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ 2026 t20 వరల్డ్ కప్ భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించి టికెట్లు నిన్న సాయంత్రం 7 గంటల లోపే ఐసీసీ రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. ఇక మన భారతదేశంలో ఫేజ్ 1 టికెట్ 100 రూపాయల నుంచే ప్రారంభమవుతుండగా శ్రీలంకలో మాత్రం 295 రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి లేట్ చేయకుండా వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఇప్పటికే ఈ టోర్నీ కోసం అన్ని జట్లు కూడా బలమైన ప్లేయర్లను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి కూడా ఈ టి20 వరల్డ్ కప్ భారత్ గెలవాలి అని సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే జట్టులో అత్యద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వారు చాలామంది ఉన్నారు. కానీ ఈ టి20 వరల్డ్ కప్పులో భాగంగా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆడక పోవడంతో ఇరువురి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా నిరాశలో ఉన్నారు. మరి ఈ స్టార్స్ లేకుండా టి20 వరల్డ్ కప్ లో భారత్ ఎలా రాణిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.

Read also : క్యూఆర్ కోడ్ స్కామ్స్ తో.. తస్మాత్ జాగ్రత్త!

Read also : PM Modi: మీ కంటే అసదుద్దీన్ బెస్ట్, తెలంగాణ బీజేపీ నేతలపై మోడీ ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button