
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :- వైసీపీ నేతలే టార్గెటా..? ఒకరి తర్వాత ఒకరిని జైలు గడప తొక్కించడమే లక్ష్యమా…? రెడ్‌బుక్‌లో పేర్లున్న వారంతా ఊచలు లెక్కట్టాల్సిందేనా…? వల్లభనేని వంశీ తర్వాత.. కొడాలి నాని వంతు వచ్చిందా…? ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకున్న వారంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా..? జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. కొడాలి నానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
Read also : కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం
కొడాలి నాని, వల్లభనేని వంశీని వెంటాడుతామని రెడ్‌బుక్ రచయిత, మంత్రి నారా లోకేష్ ఇదివరకే హెచ్చరించారు. అన్నట్టుగానే… వల్లభనేని వంశీల 135 రోజులకుపైగా జైలు ఊచలు లెక్కపెట్టించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. వంశీ తర్వాత అరెస్ట్… కొడాలి నానిదే అని ప్రచారం జరిగింది. కానీ… కొడాలి నాని అనారోగ్యం కారణంగా ఇంత కాలం ఆగినట్టున్నారు. ఆయన కోలుకున్నట్టు కనిపించడంతో… ఇప్పుడు కేసులు తెరపైకి వస్తున్నాయి.
Read also : కన్నీరు తెప్పిస్తున్న హనుమకొండ ఇంటర్ అమ్మాయి సూసైడ్ లెటర్!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేత కొడాలి నాని… చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ఓడిపోయి… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొడాలి నానిపై విశాఖలో గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు అందింది. అంజనా ప్రియ అనే మహిళ.. విశాఖ త్రీటౌన్ పోలీసులకు కొడాలి నానిపై కంప్లెయింట్ ఇచ్చింది. చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ… ఫిర్యాదులో పేర్కొంది. ఆ కంప్లెయింట్ ఆధారంగా.. కొడాలి నానికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు పోలీసులు. సీఆర్పీసీ (CRPC)-41A కింద నోటీసులు ఇష్యూ చేశారు. ఇప్పటికే కొడాలి నానిపై చాలా కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో అరెస్ట్ తనను అరెస్ట్ చేయకుండా.. న్యాయస్థానాల నుంచి ఉత్తర్వులు తెచ్చారు. అయితే… కొడాలి నానిపై మరో కేసు నమోదవడంతో.. వాట్ నెక్ట్స్ అన్న చర్చ మొదలైంది. ఈ కేసులో కొడాలి నాని అరెస్ట్ తప్పదన్న వార్తలు వస్తున్నాయి. ఆయన్ను అరెస్ట్ చేయించకుండా… జైలుకు పంపకుండా కూటమి ప్రభుత్వ ఊరుకోదన్న ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో…? చూడాలి.
Read also : ఓవల్ టెస్టులో టీమిండియా స్టన్నింగ్ విక్టరీ, 2-2 తో సిరీస్ సమం!