తెలంగాణ

కొండా సురేఖపై రాహుల్ సీరియస్..సీఎం రేవంత్‌కు క్లాస్!

మంత్రి కొండా సురేఖ కామెంట్ల రచ్చ కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తోంది. జాతీయ స్థాయిలోనూ చర్చగా మారడం.. అన్ని వర్గాల నుంచి కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ తలలు పట్టుకుందని తెలుస్తోంది. హీరో నాగార్జున విషయంలో అసలేం జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీశారని తెలుస్తోంది. ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగి అక్కినేని అమలతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నారని సమాచారం. నాగార్జునని టార్గెట్ చేస్తూ సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించిన అమల.. తన ట్వీట్ కు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీని ట్యాగ్ చేసింది. దీంతో ప్రియాంక గాంధీ అమలతో మాట్లాడారని చెబుతున్నారు. అమలతో మాట్లాడటంతో పాటు ఇతరత్రా వర్గాల ద్వారా ప్రియాంక పూర్తి సమాచారం తెప్పించుకున్నారని టాక్.

హీరో నాగార్జునపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లు జుగుప్సాకరంగా ఉన్నాయని భావించిన హైకమాండ్… టీపీసీసీ పెద్దలకు క్లాస్ పీకారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ కార్యాలయం మంత్రి కొండా సురేఖకు కాల్ చేసి వివరణ కోరారని తెలుస్తోంది. రాహుల్ గాంధీకి శుక్రవారం రాత్రే కొండా సురేఖ వివరణ పంపారని సమాచారం. అయితే కొండా సురేఖ వివరణపై సంతృప్తి చెందని రాహుల్ గాంధీ.. కొండా సురేఖపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారంటున్నారు. కొండాను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారని తెలుస్తోంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖను తప్పించి.. ఆమె స్థానంలో మరో బీసీ నేతను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని టాక్. ఆది,సోమవారాలు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ పర్యటనలోనే కొండా సురేఖ డిస్మిస్ తో పాటు కొత్త మంత్రుల కూర్పుపై క్లారిటీ వస్తుందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నారు.

మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలు గట్టిగానే క్లాస్ పీకారని తెలుస్తోంది. మంత్రులు ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో కంట్రోల్ లేకపోతే ఎలా ప్రశ్నించారని సమాచారం. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి అలాంటి కామెంట్లు ఎలా చేస్తారని నిలదీశారని అంటున్నారు. రాహుల్ గాంధీ క్లాస్ పీకడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏం మాట్లాడలేక సైలెంట్ అయ్యారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button