Tuesday, February 24, 2026
Homeక్రైమ్కారును ఢీకొట్టిన బస్సు..  చౌటుప్పల్ లో ఇద్దరు మృతి

కారును ఢీకొట్టిన బస్సు..  చౌటుప్పల్ లో ఇద్దరు మృతి

దీపావళి పర్వదినాన హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద తెల్లవారుజామునే పెను విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న స్విఫ్ట్ కారును వెనుకంచి ఢీకొట్టిందిప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ట్రావెల్స్ బస్సు అతి వేగంగా రావడంతో కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ హాస్పిటల్ కు తరిలించారు. మృతులు దీపావళి పండుగ కోసం హైదరాబాద్ నుండి నకిరేకల్ వెళ్తుండగా ఘటన జరిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments