Saturday, March 28, 2026
Homeతెలంగాణకల్వకుంట్ల కవిత: కొత్త పార్టీ 'సర్వోదయ తెలంగాణ' సాధనే లక్ష్యంగా..!

కల్వకుంట్ల కవిత: కొత్త పార్టీ ‘సర్వోదయ తెలంగాణ’ సాధనే లక్ష్యంగా..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్‌లో పర్యటించిన ఆమె, మార్పు కోరుకునే అభ్యుదయవాదులంతా తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

అయితే 2026 ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీ పేరు మరియు జెండాను ఆవిష్కరించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ ఫంక్షన్ హాల్ (అధ్వయ కన్వెన్షన్) వద్ద భారీ బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు.

‘సర్వోదయ తెలంగాణ’ సాధనే లక్ష్యంగా, నీళ్లు, నిధులు, నియామకాల వంటి ఆశయాల కోసం పోరాడేందుకు ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పార్టీలో మహిళలు, యువతకు మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని కవిత పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments