Tuesday, February 24, 2026
Homeతెలంగాణఒకే ఒక ఇంటి ముందు వర్షం.. హైదరాబాద్‌లో విచిత్రం

ఒకే ఒక ఇంటి ముందు వర్షం.. హైదరాబాద్‌లో విచిత్రం

హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోజూ ఏదో ఒక ప్రాంతంలో వర్షం దంచి కొడుతోంది. ఉదయమంతా ఎండ కాస్తుండగా.. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. కుండపోతగా వర్షం కురుస్తోంది. అయితే హైదరాబాద్ లో శనివారం విచిత్రం జరిగింది. కేవలం ఒకే ఒక ఇంటి పరిధిలోనేవ వర్షం కురిసింది. ఇది చూసి అంతా అశ్చర్యపోయారు.

హైదరాబాద్ లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా చల్లబడింది. నల్లటి మేఘాలు నగరాన్ని చుట్టేశాయి. అయితే హైదరాబాద్ లోని ఓ ఏరియాలో మాత్రం అద్భుతం జరిగింది. ఒక ఏరియాలో కేవలం 10 మీటర్ల పరిధిలో మాత్రమే వర్షం పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మురాద్ నగర్ కాలనీలో మేఘానికి చిల్లుపడినట్లు ఒక ఇంటి దగ్గరేకే కేవలం ఆరడుగుల వ్యాసార్థంలో వర్షం కురిసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments