తెలంగాణ
Trending

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ…

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ల పిటిషన్‌లపై ఈరోజు హైకోర్టు విచారణ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్​పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేయనుంది. కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Also Read : కేకేకు కీలక పదవి.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!!

అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడంలేదన్నారు. పిటీషనర్ల తరఫు న్యాయవాదులు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా బీఆర్ఎస్​ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జులై 3న హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను సోమవారం నాటికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారని.. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కూకట్​పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్​ శాసన సభ్యులు పాడి కౌశిక్​ రెడ్డిలు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. బీఆర్ఎస్‌కి భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
  2. జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత.. కొట్టుకున్న బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు!!
  3. ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలు.. పట్టించుకోని మండల విద్యాధికారి
  4. అట్లుంటది మనతోని.. బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపిన కల్వకుంట్ల హిమాన్షు!!

Back to top button