
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఉపరితల ఆవర్తనం కారణంగా నేడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా తీరానికి అనుకొని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది అని APSDMA అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Ap లో వర్షాలు పడి జిల్లాలు
1. కోనసీమ
2. కృష్ణ
3. గుంటూరు
4. బాపట్ల
5. ప్రకాశం
6. నెల్లూరు
7. కర్నూలు
8. కడప
9. తిరుపతి
పైన పేర్కొన్న ఈ తొమ్మిది జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కాబట్టి అధికారుల సూచనలు మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. తుఫాన్ కారణంగా మొన్నటి వరకు కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. నేడు కార్తీక పౌర్ణమి కాబట్టి వర్షం పడుతున్న సమయంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలి అని అధికారులు సూచించారు. పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలకు వెళ్ళే అవకాశాలు ఉండడంతో దేవాలయ శాఖ అధికారులు కూడా అంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇవాల్టి రోజుతో హైదరాబాద్ సహాయ జిల్లాలలో కూడా వర్షాలు ముగుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు.
Read also : హిట్లు లేకపోయినా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీ లీల!
Read also : హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్…. డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ దందా





