Thursday, February 19, 2026
Homeజాతీయంఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఇన్ని నష్టాలా?

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఇన్ని నష్టాలా?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈరోజుల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా మానేయడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. ప్రతి 1,000 మందిలో దాదాపు 20 నుంచి 50 మంది వరకు ఈరోజుల్లో బ్రేక్ఫాస్ట్ చేయడం లేదు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అని.. శరీరం చిన్న భిన్నం అవుతుంది అని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల కేవలం బరువు పైన మాత్రమే కాకుండా ప్రాణాంతక వ్యాధులకు కూడా దారి తీస్తుంది అని పరిశోధకులు వెల్లడించారు. ఉదయం పూట టిఫిన్ చేయకపోతే వారికి గుండె జబ్బుల ముప్పు 27% అలాగే టైప్ 2 డయాబెటిస్ పురుషుల్లో 21 శాతం,మహిళల్లో 20 శాతం పెరుగుతుంది అని అన్నారు.

కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకోవాలి. ఏదో ఒక రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి అని.. లేదు అంటే శరీరంలో గ్లూకోజ్ మరియు లిపిడ్ కంట్రోల్ తప్పడమే కాకుండా ఇన్సులిన్ లెవెల్స్ అస్తవ్యస్తమవుతాయి అని పరిశోధకులు చేసిన విచారణలో తేలింది. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసేవారి బ్రెయిన్ ఫంక్షన్ కూడా దెబ్బతింటున్నట్లు తెలిసింది. కాబట్టి ఇంట్లో ఏం ఉన్నా సరే వాటిని తినాలి లేదా బయటికి వెళ్లి టిఫిన్ షాపులలోనైనా సరే టిఫిన్ చేయాలి అని పరిశోధకులు చెబుతున్నారు. ఏదో ఒకటి ఉదయం సమయంలో కచ్చితంగా తినాలి అని మధ్యాహ్నం వరకు తినకుండా ఉంటే కచ్చితంగా ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి పడుతుంది అని వైద్యులు అలాగే పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments