క్రీడలు

ఇండియాకు మద్దతుగా ఎందరో.. మరి సౌతాఫ్రికాకు ఎక్కడ?.. నటి ఆవేదన

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత్ మరియు సౌతాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా సౌత్ ఆఫ్రికా నటి అయినటువంటి తన్జ వూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో టీమ్ ఇండియాకు మద్దతుగా స్టార్ క్రికెటర్లు సచిన్, రోహిత్ శర్మ, గవాస్కర్, లక్ష్మణ్ వంటి వారితోపాటు ప్రముఖ సినిమా మరియు రాజకీయ నాయకులు స్టేడియానికి వచ్చారు. కొన్ని వందల సంఖ్యలో వీఐపీలు భారత్ కు సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు మరి సౌత్ ఆఫ్రికాకు అలా ఎందుకు రాలేదు అని సౌత్ ఆఫ్రికా నటి ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనల్స్ లో మన వాళ్లకు మద్దతుగా ఉన్నది ఎంతమంది?.. ఎందుకు సపోర్ట్ గా ప్రముఖులు రాలేకపోయారు అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. క్రికెటర్లు అందరూ కూడా కలగా భావించేటువంటి కప్ కోసం కనీసం స్పోర్ట్స్ మినిస్టర్ అయినా కూడా వచ్చి సపోర్ట్ చేయలేకపోయారా అని అసహనం వ్యక్తం చేశారు. మన మహిళా క్రికెటర్లు ఎంతో ధైర్యంగా ఆడుతూ ఫైనల్స్ వరకు తీసుకువచ్చినా కూడా సపోర్ట్ చేయడానికి కనీసం కొంతమంది మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, నటులు ఎందుకు రావడం లేదని ఆమె ప్రశ్నించారు. భారత్ ఆ దేశ క్రికెట్కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి అని… భారత్ ను చూసి నేర్చుకోవాలి అని సౌత్ ఆఫ్రికా హీరోయిన్ అయినటువంటి తన్జ వూర్ కోరారు.

Read also : కూతురు లవ్ మ్యారేజ్.. ఆగ్రహంతో తండ్రి ఏం చేశాడో తెలుసా?

Read also : స్మోకింగ్, ఆల్కహాల్ కంటే డేంజరస్ అలవాటు ఏంటో మీకు తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button