Tuesday, February 24, 2026
Homeతెలంగాణఅనుముల తిరుపతి రెడ్డి గారు.. మీరు చాలా గ్రేట్.. కేటీఆర్ సంచలన ట్వీట్

అనుముల తిరుపతి రెడ్డి గారు.. మీరు చాలా గ్రేట్.. కేటీఆర్ సంచలన ట్వీట్

హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు చాలా గ్రేట్ గురూ.. మీ గెలుపు చిట్కా ఏంటో మాకు చెప్పండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్ లో ఏముందంటే..

LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!

50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!

72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!
వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల కూల్చివేయబడింది!

తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా…మీ విషయంలో నోరు మెదపలేదు!

వాల్టా అనుకుంటా….ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!

ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!

మీ సోదరుది బల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!

RELATED ARTICLES

Most Popular

Recent Comments