తెలంగాణహైదరాబాద్

అక్క భర్తను లవ్ చేసిన యువతి.. వద్దని చెప్పిన తల్లిదండ్రులు..చివరకు!!!

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ ప్రతినిధి : సొంత అక్క భర్తను ప్రేమించింది ఆ యవతి. అతడితోనే కలిసి జీవిస్తానని బావ ఇంటికి వెళ్లింది. పెద్ద కూతురి కాపురం కూలిపోతుందని తల్లిదండ్రులు ఆమెకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినిపించుకోలేదు. తనకు బావే కావాలంటూ మెుండిపట్టు పట్టింది. తల్లిదండ్రులు ససేమిరా అనటంతో తట్టుకోలేకపోయింది. పెద్దలు తమను కలిసి బతకనివ్వరని చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన పాములపాటి ప్రసాద్ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారు జీవనోపాధి కోసం.. 2 సంవత్సరాల క్రితం నగర శివారు ప్రాంతానికి వచ్చారు. ఔటర్ రింగు రోడ్డు సమీపంలో గుడిసెలు వేసుకుని.. పొట్ట పోసుకుంటున్నారు. అయితే పెద్ద కుమార్తెకు.. నగరానికి వలస రాకపోముందే.. కారంచేడు ప్రాంతానికి చెందిన కల్యాణ్ బాబుతో పెళ్లి చేశారు.

Read Also : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీకవిత జ్యుడిషియల్ కస్టడీ?

కల్యాణ్ బాబు తాపీ పని చేస్తుండేవారు.. అతను కూడా తర్వాతి కాలంలో భార్యతో కలిసి.. హైదరాబాద్‌కు వచ్చాడు. ప్రసాద్ చిన్న తనయ ఇందిర(20) టెన్త్ క్లాస్ తర్వాత చదువు ఆపేపింది. ఇంటి వద్ద పనులు చూసుకుంటూ.. అప్పుడప్పుడు తల్లిదండ్రులు, అక్కా బావతో.. పనులకు వెళ్లేది. అయితే ఇందిర.. తన అక్క భర్తను లవ్ చేసింది. అతడితో జీవించాలని నిర్ణయించుకుంది. ఇటీవల అక్కా బావ ఇంటికి వెళ్లి.. ఈ విషయాన్ని చెప్పింది. వారు.. ఈ విషయాన్ని ఇందిర తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారు కూతుర్ని గద్దించారు. బయట తెలిస్తే.. పరువు పోతుందని.. వెంటనే ఇంటికి రావాలని కోరారు. కుటుంబ పెద్దలు కూడా వారించి.. ఇందిరను అమ్మానాన్నల వద్దకు పంపేందుకు ప్రయత్నించారు. దీంతో ఇందిర సోమవారం ఉదయం.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగింది. నివాసానికి సమీపంలో అపస్మారిక స్థితిలో ఇందిరను గుర్తించిన కుటుంబ సభ్యులు .. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తలరించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇందిర తుదిశ్వాస విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు.. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోని 30 వేలకు పైగా అభ్యర్ధులు!!
  2. కేసీఆర్ మెప్పుకోసమే ఈ ప్రోటోకాల్ డ్రామా.. కాంగ్రెస్ నేతలు
  3. యూనియన్ బ్యాంకు మేనేజర్ అజయ్ ఘరానా మోసం..!
  4. సైబర్ నెరగాళ్ళ లింకు ఓపెన్ చేశారో…. ఎకౌంట్లో పైసలు మాయం….
  5. ధూంధాంగా మస్తాన్ రెడ్డి నామినేషన్

Back to top button