క్రైమ్

తలకాయే తీసేసారు.. రాహుల్ పర్యటన రోజే దారుణం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రావడానికి కొన్ని గంటల ముందే గ్రేటర్ సిటీలో దారుణం జరిగింది. మహాత్మ గాంధీ తల నరికేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులను పరుగులు పెట్టిస్తోంది.

మహాత్మునికి ఘోర అవమానం జరిగింది. కూకట్ పల్లి ప్రగతినగర్ చెరువు వద్ద గాంధీ విగ్రహం పై దాడి జరిగింది. గతంలోనూ మహాత్ముడి విగ్రహంపై మందుబాబులు దాడి చేశారు. మహాత్ముడిపై మందుబాబులు చేసిన గాయానికి అప్పుడు రంగులేసారు. కానీ ఇప్పుడు ఏకం తలకాయనే తీసేసారు

రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చే రోజే ప్రగతి నగర్లోని అంబిర్ చెరువు దగ్గర గాంధీ జయంతి రోజు ఆవిష్కరించిన గాంధీ విగ్రహంకు అవమానం జరగడం దుమారం రేపుతోంది. స్థానిక కాంగ్రెస్ నాయకులు హడావుడితో ఏర్పాటు చేసిన ఈ విగ్రహంకు ఏర్పాటు రోజు నుండే అవమానపరుస్తున్నారు ఆకతాయిలు.గతంలో మలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

గాంధీ విగ్రహం ముందే మందుబాబులు చిందులు అని, విగ్రహంకు పెయింట్ పోయింది అని అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని అంటున్నారు స్థానికులు.గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ళను పట్టుకొని వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Back to top button