
జులైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ జరిగిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. పార్టీ కేడర్‌కు ఆ దిశా సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. జులై లోపు బీసీ, ఎస్సీ బిల్లులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బీసీ బిల్లును కేంద్రానికి పంపాక… రెండు, మూడు నెలల్లో సమాధానం వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రధాని ఆమోదిస్తారని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంది. ముందు… జులైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాత..స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. పార్టీ కేడర్‌ను కూడా అందుకు సిద్ధం చేస్తోంది.
స్థానిక సంస్థల పదవీకాలం ఇప్పటికే ముగిసిపోవడంతో.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదు. దీంతో.. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటివారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం… బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలుపై క్లారిటీ రాకపోవడంతో… స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత… టెన్త్, ఇంటర్ పరీక్షలు రావడంతో.. మరింత ఆలస్యం అయింది. ఈలోపు బడ్జెట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రెండు రోజుల్లో ఈ బిల్లుకు గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత గెజిట్ కూడా విడుదల అవుతుంది. ఈ బిల్లును కేంద్రానికి కూడా పంపుతున్నారు. మరో రెండు నెల్లల్లో దీనిపై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కనుక… జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
Read More : ప్రచారాలు నమ్మకండి… బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు?
ప్రస్తుతం రాష్ట్రంలో ఏ స్థానిక సంస్థలకు పాలక వర్గం లేదు. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేక ఏడాది అవుతోంది. ఇక… జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పరిస్థితి కూడా అంతే. దాదాపు 9 నెలలుగా జిల్లా, మండల పరిషత్‌లలోనూ పాలకమండళ్లు లేవు. దీంతో… అభివృద్ధి జరగడంలేదు. స్ట్రీట్ లైట్లు మార్చేందుకు కూడా కాంట్రాక్టులు ఇవ్వలేని పరిస్థతి. మరోవైపు.. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో GHMCకి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కనుక.. ఆలోపే.. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టి.. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నది సర్కార్ ప్లాన్.
ఇవి కూడా చదవండి …
-
జగన్‌కు ఏడుగురు ఎమ్మెల్యేల వెన్నుపోటు – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారుగా…!
-
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం!..
-
కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.
-
టీడీపీని తొక్కుకుంటూ పైకొస్తున్న జనసేన – తిరుపతి చంద్రబాబు పర్యటనే సాక్ష్యం
-
2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?