క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- టి20 వరల్డ్ కప్ లో భాగంగా పసికూన జట్లు కూడా అద్భుతంగా రాణిస్తూ బలమైన జట్లను వణికిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ టి20 వరల్డ్ కప్ లో పసికూన జట్ట అయినటువంటి జింబాబ్వే జట్టు ప్రత్యర్థులను భయపెడుతుంది. వరుస విజయాలతో ఏకంగా సూపర్-8 కు చేరుకోవడమే కాకుండా ఇప్పుడు ఈ జట్టు ఫామ్ చూస్తున్న ప్రత్యర్థి జట్లన్నీ కూడా భయపడుతున్నాయి. ఆస్ట్రేలియా శ్రీలంక లాంటి దిగ్గజ జట్లపై జింబాబ్వే ఘన విజయాన్ని సాధించింది. ఇక ఈ నెల 26న సూపర్ ఎయిట్ లో భాగంగా టీమిండియా మరియు జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను ముందుగానే పసుగట్టిన భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఏ మ్యాచును జోకుగా తీసుకోవద్దు అని.. అందులో మరీ ముఖ్యంగా ఈ జింబాబ్వే జట్టును చాలా ఈజీగా తీసుకోవద్దు అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. జింబాబ్వే జట్టులోని ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి మరి ఆడుతున్నట్లుగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆస్ట్రేలియా అలాగే శ్రీలంక లాంటి పెద్ద జట్లనే ఓడించారు అంటే మిగతా జట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం బౌలింగ్, బ్యాటింగ్ అలాగే ఫీల్డింగ్ లోనే మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లోనూ ఈ జట్టు ప్లేయర్స్ అదుర్స్ అనిపిస్తున్నారు. దీంతో ఏ మ్యాచ్ కూడా తేలిగ్గా తీసుకోకూడదు అని ఇప్పటికే ప్రత్యర్థి జట్టులన్నీ కూడా సిద్ధమవుతున్నాయి.
బయటకొచ్చిన వెంటనే జగన్ ను కలిసిన అంబటి రాంబాబు
Tea: ఖాళీ కడుపుతో టీ తాగితే జరిగేది ఇదే!
