
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ పార్టీ, కార్యకర్తలు మెడికల్ కాలేజీల విషయంపై అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అసలు పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ కాదని లోకేష్ స్పష్టం చేశారు. మేము ఏ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించడం లేదని అన్నారు. 2028 సంవత్సరంలోపు అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా విద్యార్థులకు విద్య పట్ల ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రోడ్లు అలాగే విమానాశ్రయాలు ఇవన్నీ కూడా పీపీపీ విధానంలోనే అభివృద్ధి చేస్తున్నాం. అంతమాత్రాన అవన్నీ కూడా ప్రైవేట్ వారికి కట్టబట్టేసినట్టేనా అని వైసీపీ పార్టీని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కనీసం ఐదు ప్రభుత్వ కాలేజీలు కూడా నిర్మించలేకపోయారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చే సమయంలో కాంగ్రెస్ నేతలు చాలా విమర్శలు చేశారు. అలా అని చంద్రబాబు వెనకడుగు వేయలేదు కదా.. అలా వెనకడుగు వేసుంటే నేడు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేవా?.. అని ప్రశ్నించారు. ఇది ప్రిజనరీకి- విజనరీకి ఉన్న తేడా అంటూ జగన్ ను మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేటు వాళ్లను భాగస్వాములను చేస్తే అది ప్రైవేటీకరణ ఎలా అవుతుంది?.. అని జగన్ ను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో తన మనుషులకు ఇచ్చిన కాంట్రాక్టులు ఎక్కడ పోతాయో అని జగన్ భయంతో గగ్గోలు పెడుతున్నారు అని అన్నారు.
Read also : దానధర్మాలకు, వ్యసనాల జోలికి పోకుంటే నేటికీ 1000 కోట్లు ఉండేవి : జగపతిబాబు
Read also : రెండు అల్పపీడనాలు, మరో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం ఖాయం?