తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం కోసమే ఆవిర్భవించిన పార్టీ అని.. పోరాటమనేది తమకు కొత్త కాదుని కేటీఆర్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి,చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం.. ఈ చిట్టినాయుడు ఎంత అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు.నదులు ఎక్కడ ఉన్నాయో, విప్రో ఛైర్మెన్ ఎవరు తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి… అలాంటి వ్యక్తి మనకి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం అన్నారు.
భారత దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు కేటీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చినా తెలంగాణ భవన్ హక్కున చేర్చుకుంటుందని..వారికి అండగా ఉంటుందని తెలిపారు. జీవో 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.. వాళ్లకు మద్దతుగా అశోక్ నగర్ పోదామని అనుకుంటే అశోక్ నగర్ చుట్టు పోలీసుల ఉన్నారని కేటీఆర్ అన్నారు. గ్రూప్ 1అభ్యర్థులే తెలంగాణ భవన్ కు వచ్చారు… వారికి అండగా బిఆర్ఎస్ ఉంటుందని ప్రకటించారు.
రైతు బంధు, రుణమాఫి ఊసే లేదన్నారు కేటీఆర్. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టి.. రేవంత్ రెడ్డి ఢిల్లికీ మూటలు తీసుకోని పోతుండని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని విమర్శించారు.తులం బంగారం ఏమైంది అన్నందుకు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి ఒక్కటేనన్న కేటీఆర్..మూసి పేరుతో పేదల ఇండ్లు కూల్చుతుంటే బిజెపి మౌనంగా ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో జుమ్లా పీఎం… రాష్ట్రంలో హౌలా సీఎం అంటూ హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. బిఆర్ఎస్ ఒడిపోతుందని ఎవరు అనుకోలేదని.. బిఆర్ఎస్ వ్యతిరేకతను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిందని అన్నారు.
మీడియా ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందని కేటీఆర్ ఆరోపించారు.ప్రభుత్వం పై బిఆర్ఎస్ పోరాడుతుంటే ఒక్క మీడియా చూపించడం లేదన్నారు. అందుకే సోషల్ మీడియాలో మనం యాక్టివ్ గా ఉండాలని బీఆర్ఎస్వీ నేతలకు సూచించారు కేటీఆర్.రాష్ట్రంలో ప్రతి కాలేజీలో BRSV జెండా ఉండాలి , బ్యానర్ ఉండాలన్నారు. డి లిమిటేషన్ జరిగే అవకాశం ఉందని.. అప్పుడు విద్యార్థి ఉద్యమాల నుంచి వారికి భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడి దాడులు జరిగితే ఎటువంటి సమాచారం బయటకు రాలేదని..బిజెపి, కాంగ్రెస్ తోడుదొంగలు అనడానికి ఇదే నిదర్శనమని కేటీఆర్ అన్నారు.