తెలంగాణ

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలవాలి..

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి:- గ్రామాల్లో కొత్తగా వచ్చే అనుమానుమనితుల సమాచారం ఎప్పటికప్పుడు గ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వడం ద్వారా గ్రామాలలో నేరాలు నిరోధించడానికి ఉపయోగపడతాయని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవర్ అన్నారు. మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని ఆగమోత్కూర్ గ్రామాన్ని ఎస్పీ సందర్శించారు.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ… గ్రామ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు మెరుగైన సేవలు, సత్వర ప్రజా సమస్యల పరిష్కారం పొంద వచ్చననీ అన్నారు. ప్రజలకు మరియు పోలీసులకు మధ్య సత్సoబంధాలు ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ సాధ్యం అవుతుందని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. గ్రామాల్లో కి కొత్తగా వచ్చే అనుమానుమనితుల యొక్క సమాచారం ఎప్పటి కప్పుడు గ్రామ ప్రజలు విలేజ్ పోలీస్ అధికారికి అందించడం ద్వారా గ్రామాల్లో జరిగే నేరాలు నిరోధించడానికి ఉపయోగపడతాయని అన్నారు. గ్రామంలో ఏ యొక్క సమస్య ఉన్న విపిఓ గారికి తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్యలు సత్వరమే తీర్చడానికి కృషి చేస్తారని అన్నారు. గ్రామాల్లో సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా గాని మీసేజ్ ల ద్వారా గాని మీ యొక్క సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితులలో ఎవరికి సమాచారం అందించకూడదని అన్నారు. అలాగే యువత మాదక ద్రవ్యాలకి అలవాటు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండి గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఎవరైనా గ్రామంలో గంజాయి ఇతర మాదకద్రవ్యాలు క్రయ విక్రయాలు చేస్తే వెంటనే సమాచారం అందించాలని మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని అన్నారు. పోలీస్ శాఖలో ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో గ్రామంలో ముగ్గురికి ఉపాధి అవకాశం కలిగినందుకు అభినందనలు తెలిపారు. ఇలాగే యువత గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, రూరల్ సిఐ పి ఎన్ డి ప్రసాద్, మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య, ఆగామోత్కూర్ వీపీఓ సైది రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button