తెలంగాణ

యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

మక్తమాదారం సర్పంచ్ నరసింహ గౌడ్ ఉపసర్పంచ్ ఎర్ర శ్రీనివాస్ గౌడ్

క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మక్త మాదారం గ్రామ సర్పంచ్ నరసింహ గౌడ్ ఉప సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్త మాదారం గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. మక్త మధారం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్ గౌడ్ సహకారంతో నిర్వహించిన కడ్తాల్ మండల లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్లో మొత్తం 18 టీంలు పాల్గొన్నారు. మొదటి బహుమతి కడ్తాల్ టీమ్ కైవసం చేసుకోగా రెండవ బహుమతి రావిచేడ్ టీం గెలిచింది. సలార్ పూర్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. విజేతలకు మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ సర్పంచ్ ఉప సర్పంచ్ స్థానిక ఎస్సై కలిసి తో బహుమతులు అందజేశారు.

ఏంటి అభి భాయ్.. 12 బంతుల్లోనే 50 చేయాల్సింది : యువరాజ్ సింగ్

విజేతలకు షీల్డ్ లతో పాటు మొదటి బహుమతి 15 వేల రూపాయలు, రెండో బహుమతి 10వేలు, మూడో బహుమతి రూ,5వేలు నగదును క్రీడాకారులకు అందజేశారు. టీషర్ స్పాన్సర్ ఎల్పీ గౌడ్, సర్పంచ్ నరసింహ గౌడ్, వార్డు సభ్యులు శ్రీకాంత్ మర్ల యాదయ్య మైసమ్మ మహేశ్వరి సరిత యాదయ్య యాదగిరి మాజీ సర్పంచ్ సులోచన సాయిలు మాజీ ఉప సర్పంచ్ బండి గణేష్ మాజీ ఎంపిటిసి చంద్రమౌళి ఆర్గనైజర్స్ చందు నరేందర్ బాలకృష్ణ శేఖర్ గౌడ్ మహేష్ గౌడ్ మహేష్ దేవి ప్రసాద్ విజయ్ సురేష్ దేవేందర్ బండి సిద్ధూ చిన్న మధు యాదవ్ శివకృష్ణ మరల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో కిటికీటలాడుతున్న మేడారం.. ఈ కొన్ని విషయాలలో జాగ్రత్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button