
మిర్యాలగూడ,క్రైమ్ మిర్రర్:- మిర్యాలగూడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ భవన్‌లో ఆదివారం యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగింది.ఈ సందర్భంగా షేక్ అజారుద్దీన్ మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డులలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి వార్డులో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేరవేయడంలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలని సూచించారు.అదేవిధంగా యువజన కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఐవైసీ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో మిర్యాలగూడ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పర్వేజ్ ఖాన్, మండల అధ్యక్షులు పొట్టేపాక వినయ్, గాలం వేణు, చింతకాయల సురేష్, మహేష్ యాదవ్‌తో పాటు నియోజకవర్గ, మండల ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, కమిటీ సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





