బీసీ రిజర్వేషన్‌ల సాధనకై నిప్పుంటించుకొని యువకుడు ఆత్మహత్య
తెలంగాణా రాష్టా సాధనకై అప్పుడు శ్రీకాంత చారి బలి
బీసీల 42 శాతం రిజర్వేషన్‌ల సాధనకై ఇప్పుడు ఈశ్వర్ చారి బలి
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ చేస్తూ యువకుడు సాయి ఈశ్వర్ చారి ఆత్మబలిదానం చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. రిజర్వేషన్ల పెంపు హామీ నెరవేరలేదనే నిరాశతోనే ఆయన ఈ తీవ్ర నిర్ణయానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారం సాధించిన తరువాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చిన హామీ అమలు కానందునే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై సంఘీభావం వ్యక్తజేస్తూ పలువురు నాయకులు, సంస్థలు స్పందించారు. సాయి ఈశ్వర్ చారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం కలిగించాలని వారు ప్రార్థించారు.
బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బలిదానాలు సమస్యలకు పరిష్కారం కావని, జీవించి ఉన్నప్పుడే పోరాటం విజయవంతమవుతుందని పలువురు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో బీసీ రిజర్వేషన్ల అమలుపై మరోసారి చర్చలు ప్రారంభమయ్యాయి.





