సినిమా

“తెలుసు కదా”.. ఆహా మరో హిట్ అయ్యిందా?.. రివ్యూ ఇదే!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- సిద్దు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కినా సినిమా ‘తెలుసు కదా’. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు థియేటర్లలో విడుదల అయింది. సిద్దు జొన్నలగడ్డ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అలాగే చిత్ర బృందం కూడా గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా గురించి పెంచుతూ ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే ఈ తాజాగా నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా కథ విషయానికి వస్తే… అనాధ హీరో అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ ఫ్యామిలీ గా మారాలనుకునే క్రమంలో ఎదురయ్యేటువంటి ఘటనలే ఈ స్టోరీ. గతంలో ఉన్నటువంటి మాజీ ప్రియురాలు శ్రీనిధి ని అలాగే ప్రస్తుత భార్య అయినటువంటి రాశిఖన్నా ను హీరో ఎలా డీల్ చేస్తాడు?.. వీరి మధ్య వచ్చే సెన్సిటివ్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటాయి. మరోవైపు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అలాగే సినిమా సాంగ్స్ అన్ని పర్లేదు. ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది కాబట్టి మాస్ ఆడియన్స్ ను ఈ సినిమా మెప్పించలేదు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయి. సినిమా కథ అయితే బాగుంది కానీ క్లైమాక్స్ గురించి డైరెక్టర్ ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి సిద్దు జొన్నలగడ్డ తన కెరీర్లో ఒక మంచి సినిమానే ఎంచుకున్నారు. హీరో, హీరోయిన్స్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. కాకపోతే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చాలా స్లోగా ఉంటాయి. సినిమా మొత్తం పూర్తిగా ప్రేమతో నిండిపోవడంతో లవ్ బర్డ్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మాస్ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి రావాల్సిన అవసరం లేదు.

తెలుసు కదా సినిమా రేటింగ్ : 2.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button