
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేయాలని రూల్ ఉంది. దాన్ని నేడు 10 గంటల వరకు పెంచుతున్నట్లుగా కూటమి ప్రభుత్వం నిర్ణయం వెల్లడించింది. ఈ నిర్ణయం షాపులు, ఫ్యాక్టరీలు అలాగే వివిధ కంపెనీలలో రోజువారి పనులు చేసే వారికి వర్తిస్తుంది అని ప్రకటించింది. పని గంటలు పెంచేటువంటి సవరణ బిల్లుపై ఏపీ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. 8 గంటలు ఉన్న పని గంటల సమయాన్ని 10 గంటలకు పెంచడమే కాకుండా.. వారానికి 48 గంటల సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఇక వీరందరికీ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి విశ్రాంతి ఇవ్వాలని అన్నారు. మహిళలకు అయితే నైట్ షిఫ్ట్ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు.. అది కూడా వారి అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. వీళ్ళందరికీ ఆ సంస్థ వాళ్లు, కంపెనీ వాళ్లు ట్రావెల్స్, సదుపాయం అలాగే సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ పని గంటల పెంచే సవరణ బిల్లును కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శాసనసభలో తాజాగా ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు 75 గంటల ఓవర్ టైం చేసేందుకు అనుమతి ఉండగా.. ఇప్పుడు ఏకంగా 164 గంటలకు పెంచడం జరిగింది. మహిళలకు ప్రత్యేకంగా ఇంటి నుంచి పని చేసే కంపెనీ లేదా సంస్థ వరకు ప్రత్యేకంగా రవాణా సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు. కాబట్టి రోజు వారు పనిచేసే వ్యక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Read also: తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు.. తుఫాన్ గా మారే అవకాశం?
Read also : పనికిరాని వాళ్ళు వద్దంట… భారత్ ను కావాలనే అవమానిస్తున్నారా?