
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ప్రతిపక్ష పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయిన ప్రతిపక్ష పార్టీలోని నాయకులకు మాత్రం బుద్ధి రావట్లేదు అని ఆగ్రహించారు. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో రౌడీయిజం చేస్తున్నారు అని.. మేము అధికారంలోకి వస్తే చంపేస్తాము అని అధికారులనే బెదిరిస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఆరోపణలు చేశారు. ఇక ఎన్నికల సమయంలో నేను సీట్లు అమ్ముకున్నానని తీవ్రంగా విమర్శించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రజల కోసమే తాను సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చింది అని.. అది నా వ్యక్తిగత నిర్ణయం అని స్పష్టం చేశారు.
Read also : ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్.. గెలుపు ఎవరిది?
నిన్న తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో “అమరజీవి జలధార” అనే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతిపక్ష పార్టీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారము ఉన్నప్పటికీ లేదా అధికారం లేనప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పటికీ ఇలానే, నాలానే ఉంటాడు అని అన్నారు. బెదిరించే నాయకులకు ఈ పవన్ కళ్యాణ్ భయపడడు అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజం చేసే వాళ్లకి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి తరహాలో ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలోకి రారు అని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తే కానీ ఈ ఆకు రౌడీలు దారిలోకి రారు అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నిపుణులు చర్చిస్తున్నారు.
Read also : ఎదురింటి వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికేసిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్!





