తెలంగాణ

మొన్న కేటీఆర్‌.. నిన్న హరీష్‌.. నెక్ట్స్‌ ఎవరు..? – టార్గెట్లను గురిచూసి కొడుతున్న కవిత..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కవిత… ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. సొంత పార్టీ బీఆర్‌ఎస్‌పై, కుటుంబసభ్యులపై తిరుగుబావుటా ఎగరేశారు. చిట్‌చాట్లతో ఎప్పటికప్పుడు హాట్‌ కామెంట్స్‌ చేస్తూ.. పొలిటికల్‌గా హీట్‌ పెంచుతున్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ను విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిపారంటూ… అన్న కేటీఆర్‌పై గన్‌ ఎక్కుపెట్టారు కవిత. 24 గంటలు గడవకముందే… ఎంపీ రఘునందన్‌పై విమర్శల పేరుతో హరీష్‌రావును టార్గెట్‌ చేశారు. కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాలు వీళ్లే అని చెప్పకనే చెప్తున్నారు. కేటీఆర్‌, హరీష్‌రావు అయిపోయారు.. ఇక కవిత దెయ్యాల లిస్ట్‌లో నెక్ట్స్‌ ఎవరు..? అన్న చర్చ జరుగుతోంది.

BRSను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని చెప్పారు కవిత. ఆ తర్వాత.. బీజేపీ ఎంపీ రఘునందన్‌ భుజాలపై నుంచి హరీష్‌రావుకు గురిపెట్టారు. బీజేపీ నేతకు సంబంధించిన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లింది ఎవరు..? అంటూ చిట్‌చాట్‌లో ప్రశ్నించారు. ఎప్పుడో జరిగిపోయిన అంశాన్ని.. ఆమె ఇప్పుడు ఎందుకు బయటకు తీశారన్న చర్చ జరిగింది. అంటే… గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్‌రావు ఉన్నారు. ఆ సమయంలో రఘునందన్‌రావు కూతురు ఆస్పత్రిని హరీష్‌రావు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇప్పుడు హైలెట్‌ చేశారు కవిత.

బీజేపీ ఎంపీ రఘునందన్‌ కూడా.. కవితపై వరుస విమర్శలు చేస్తున్నారు. ఆమె త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారని ఖరాఖండీగా చెప్తున్నారాయన. అంటేకాదు.. కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యారు ఎవరో చిట్‌చాట్‌లో కాకుండా.. నేరుగానే చెప్పొచ్చు కదా అని కవితకు కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా… రఘునందన్‌ను కూడా టార్గెట్‌ చేశారు కవిత. రఘునందన్‌ ద్వారా హరీష్‌రావుకు గురిపెట్టారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట. కవిత.. చాలా తెలివిగా అడుగులు ముందుకేస్తున్నారు. రోజుకో చిట్‌చాట్‌ చేస్తూ… రాజకీయంగా సంచలం రేపుతున్నారు.

ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. కేసీఆర్‌కు రాసిన లేఖ విషయంలో.. తాజాగా ఆమె చెప్పి వ్యాఖ్యలు…. కొంత ఆలోచనలో పడేస్తున్నాయి. తన తండ్రికి వందల లేఖలు రాశానని.. అవన్నీ చదవి చించేస్తారని.. ఇప్పుడు ఈ లేఖ ఎలా బయటకువచ్చిందో అర్థం కావడంలేదని గతంలో చెప్పారు కవిత. కానీ.. ఇప్పుడు మాత్రం… తన తండ్రిని కలవాలని ప్రయత్నించినా వీలు కాలేదని.. అందుకే లేఖ రాశానని అంటున్నారు. దీంతో.. కవిత అప్పుడు చెప్పిన దానికి.. ఇప్పుడు చెప్పిన దానికి పొంతలేదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు… బీఆర్‌ఎస్‌లో కీలక నేతల్లో రోజుకొకరు చొప్పున టార్గెట్‌ చేస్తున్న కవిత… నెక్ట్స్‌ ఎవరిని టార్గెట్‌ చేయబోతున్నారన్న చర్చ కూడా ఉంది. ఇదంతా పక్కన పెడితే.. బీఆర్‌ఎస్‌పై గరంగరంగా ఉన్న ఆమె.. రాజకీయ భవిష్యత్‌ ఏంటి…? అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఆమె కొత్త పార్టీ పెడతారా…? లేదా… వేరే పార్టీలో చేరుతారా..? అన్న చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button