
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- బాలీవుడ్ సీనియర్ నటులు వరుసగా అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆసుపత్రిలో చేరుతున్నారు. నిన్న ప్రముఖ దిగ్గజ నటుడు ధర్మేంద్ర చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరగగా ఆ తరువాత తన కూతురు నటి ఈశా డియోల్ అవన్నీ ఫేక్ వార్తలు అని.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లో చికిత్స పొందుతున్నారు అని వెల్లడించారు. అయితే తాజాగా మరో బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద ముంబై క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు. నిన్న ధర్మేంద్రను నేరుగా ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించిన ఈ నటుడు గోవింద అర్ధరాత్రి ఇంట్లోనే కుప్పకూలిపోవడంతో.. అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లుగా అతని లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న గోవింద కు వైద్యులు టెస్టులు చేస్తున్నారు అని.. వాటి రిజల్ట్స్ చూస్తే కానీ అనారోగ్యానికి గల కారణం తెలియదని ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ మధ్య బాలీవుడ్ సీనియర్ నటులు వరుసగా అనారోగ్య కారణంగా ఆసుపత్రులలో చేరుతూ చికిత్స పొందుతున్నారు. ఈ వరుస సంఘటనల వల్ల బాలీవుడ్ ఫ్యాన్స్ అందరు కూడా ఆందోళనలో ఉన్నారు.
Read also : ఇండియన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. సౌత్ ఆఫ్రికా సిరీస్ కు స్టార్ ప్లేయర్ దూరం?
Read also : కోదాడ పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన జిల్లా పోలీస్ స్పెషల్ టీమ్స్





