
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య ఒక రాక్షసుడు రాష్ట్రాన్ని పట్టి పీడించాడంటూ జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడిని ప్రజలు ఘోరంగా ఓడించారు. మళ్లీ అతన్ని గెలిపించి వైకుంఠపాళీ ఆడ వద్దని… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 10 సంవత్సరాలలో ఊహించినటువంటి అభివృద్ధి జరిగి తీరుతుంది అని విజయవాడ పున్నమి ఘాట్ లో దీపావళి వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను మళ్లీ గెలిపిస్తే కచ్చితంగా రాష్ట్రం దెబ్బతింటుంది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపిస్తున్నాము… వైకుంఠపాళి ఆడి మళ్లీ రాష్ట్రాన్ని చెడు మార్గంలో వెళ్ళనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రైన్యూర్ ఉండాలనేదే మా ప్రభుత్వ లక్షయమని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మరోవైపు ఈ వ్యాఖ్యలపై వైసీపీ స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారు… “మీరు ఏ రాక్షస జాతికి చెందినవారు” చెప్తారా అంటూ ట్విట్ చేశారు. 2004, 2009వ సంవత్సరంలో వరుసగా రెండుసార్లు చిత్తుగా జనాలు ఓడించారు. అసలు మీరు ముఖ్యమంత్రి పీఠంలోకి వచ్చిందంటే దానికి కారణం ఎన్టీఆర్ గారిని వెనుక నుంచి పొడిచి.. ఇది ఏ రాక్షసి జాతి లక్షణం అంటారు? కాస్త చెప్తారా అంటూ టిడిపికి ఘాటుగా రిప్లై ఇస్తూ వైసిపి ట్విట్ చేసింది.
Read also : కలెక్షన్లలో రికార్డు సృష్టిస్తున్న డ్యూడ్ సినిమా..!
Read also : టారిఫ్స్ కాదు ఓయ్… నీ దేశం మీద దృష్టి పెట్టు.. అంటూ నెటిజన్స్ ఆగ్రహం!