
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- మూడవ దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ మహాదేవపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో జోరుగా సాగింది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే.. ట్రాన్స్ జెండర్లు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవటం విశేషం. దీంతో.. సమాజంలో అసలైన మార్పు మొదలైందని విశ్లేషకులు చెప్తున్నారు. అశలు తమకు ఉనికే కష్టమనుకున్న పరిస్థితుల నుంచి పౌరులుగా తమ సామాజిక బాధ్యతగా ఓటు వేసి నాయకులను ఎన్నుకునే స్థాయికి చేరుకోవటమే సమాజంలో వచ్చిన అసలైన మార్పుగా అభివర్ణిస్తున్నారు. అందుకు ఈ ఫొటోలే సాక్ష్యం అంటున్నారు.
Read also : Hollywood: అవతార్-3కి షాకింగ్ రివ్యూస్.. ఇచ్చిన సంస్థలు ఇవే..
Read also : మహేశ్వరం నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్





