Sunday, March 22, 2026
Homeఆంధ్ర ప్రదేశ్వైసీపీ హిందూ ద్రోహి.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ హిందూ ద్రోహి.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా వైసీపీ నాయకులపై జరిగిన దాడులపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అలజడులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మరోసారి జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీ పార్టీపై కీలక ఆరోపనులు చేశారు. వైసీపీ పార్టీ ఒక హిందూ ద్రోహి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల దేవస్థానం లో కూడా దోపిడీకి పాల్పడింది అంటూ వ్యాఖ్యానించారు. గెస్ట్ హౌస్ రూమ్ చార్జీలను 500 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచేసి ప్రజలపై భారం మోపారు అని అన్నారు. నేను సగటు భారతీయుడుని అంటూ హిందువునని గర్వంగ చెప్పుకుంటానని నాగబాబు అన్నారు. ఆది శంకరుల అద్వైతం రమణ మహర్షి ఆత్మజ్ఞానాన్ని బట్టి ఆ పరమాత్ములను నమ్ముతాను అని నాగబాబు అన్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం లో అంతర్వేది రథం దగ్ధమైతే ఆ కేసును మసిపూసి మారేడుకాయ చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అయోధ్య రాముడు దర్శనానికి కూడా ఈ వైసీపీ నాయకులు వెళ్ళలేకపోయారు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకుల ఇళ్ల పై జరిగినటువంటి దాడుల విషయం పట్ల అల్లర్లు చెలరేగుతుండగా ఇంతలోనే జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆ పార్టీపై మరి కొన్ని ఆరోపణలు చేశారు. మరి ఈ విషయం ఎంతటి వరకు వివాదాలను సృష్టిస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డాయి.

Read also : Mamata Banerjee: న్యాయవాదిగా మారిన మమతా బెనర్జీ, బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌పై సుప్రీంలో స్వయంగా వాదనలు!

Read also : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జిన్నారెడ్డి.. అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments