ఆంధ్ర ప్రదేశ్

రెండు ఎకరాలతో… దేశంలోనే రిచెస్ట్ సీఎం అయిపోతారా?… రోజా ట్వీట్

క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ : ప్రతిరోజు సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తాజాగా దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదటి స్థానంలో నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. దానిపై తాజాగా వైసిపి మాజీ మంత్రి రోజా రిచెస్ట్ సీఎం పై సెటైరికల్ ట్విట్ చేసింది. చంద్రబాబు దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలవడంపై రోజా వెటకారంగా ట్వీట్ చేసింది.

గేమ్ చేంజెర్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్!.. ఇక దబిడి దిబిడే?

ఏడిఆర్ రిపోర్ట్ ప్రకారం దేశంలోనే 931 కోట్ల తో ఎక్కువ డబ్బున్న సీఎం గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉన్నారు. ఇక దీనిపై రోజా చెప్పుకొస్తూ కేవలం రెండెకరాలు ఉన్న వ్యక్తి కొడుకు నారా చంద్రబాబు నాయుడు అని, ఎలాంటి అవినీతి లేకుండానే చంద్రబాబు నాయుడు ఏకంగా 1000 కోట్లు ఎలా సంపాదించాడంటూ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబుపై రోజా చేసిన ట్వీట్ అనేది వైరల్ గా మారింది.

ముగ్గురి యువకుల ప్రాణాలను బలి తీసుకున్న పబ్జి గేమ్

ఇప్పటికే ఈ విషయంపై ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్లు చర్చించుకుంటున్నారు. కొంతమంది వైసీపీ మాజీ మంత్రి రోజా చెప్పిన మాటలు నిజమే కదా అని అంటున్నారు. మరి కొంతమంది మాత్రం సొంతగా పెట్టుబడులు పెట్టుకొని అభివృద్ధి పనులకు తన సొంత డబ్బును కూడా కొంతవరకు ఖర్చుపెట్టినట్లుగా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపుతున్నారు. కొందరు మాత్రం రోజా గురించి మాట్లాడుతూ నువ్వు ఎన్ని కోట్లు కొల్లగొడిచావో అందరికీ తెలుసులే అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రోజా ఎప్పటికప్పుడు ప్రత్యర్థులపై ఏదో ఒక విధముగా విరుచుకుపడుతూనే ఉంటుంది.

35 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్? కొత్త రూల్స్ ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button