Homeతెలంగాణమంత్రి పదవి కోసం గాంధీభవన్ కు గొర్లు.. తీవ్ర ఉద్రిక్తత

మంత్రి పదవి కోసం గాంధీభవన్ కు గొర్లు.. తీవ్ర ఉద్రిక్తత

గాంధీభవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలంటూ గొర్లు మేకలతో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు యాదవులు. కాంగ్రెస్ ప్రభుత్వం గొర్లకు మరియు మేకలకు మందులు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు యాదవులు. నిరసన తెలిపిన యాదవులను మరియు గొర్లను అరెస్టు చేశారు పోలీసులుయమూగజీవులను అని చూడకుండా పోలీసులు గొర్లను మరియు మేకలను డీసీఎంలలో విసిరి పడేసారని ఆందోళన వ్యక్తం చేస్తున్న పశువుల కాపర్లు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని గొర్లకు మేకలకు గాయాలు చేశారని ఆరోపించారు ఆందోళనకారులు

గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నేతలు. యాదవ గొల్ల కురుమలకు మంత్రి వర్గం లో చోటు కల్పించాలని నినాదాలు చేశారు. టి పీసీసీ కార్యవర్గం లో,నామినేటెడ్ పదవులు లో గొల్ల కురుమలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొర్ల కాపరులు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలన్నారు గొర్ల కాపరుల సంక్షేమ సంఘం నాయకులు.

Most Popular

Recent Comments