
యాదాద్రి ,క్రైమ్ మిర్రర్ :-యాదగిరిగుట్ట దేవస్థానం పరిధిలో సేవలు అందిస్తున్న ఇంచార్జి ఎస్ఈ రామారావు పై అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భారీ ఎత్తున అక్రమ సంపాదన కేసులో ఏసీబీ అధికారులు ఎల్బీనగర్‌లోని శివగంగ కాలనీలోని నివాసం మరియు యాదగిరిగుట్ట కార్యాలయంపై సమాంతర సోదాలు నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, రామారావు అనధికార మార్గాల్లో వందల ఎకరాల భూములు, కోట్లాది రూపాయల విలువైన రియల్ ఎస్టేట్, వాణిజ్య భవనాలు, బ్యాంకు డిపాజిట్లు కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సుమారు ₹100 కోట్లకు పైగా ఆస్తులు పేరుతో ఉన్నట్టు ప్రాథమిక అంచనా. సోదాల సమయంలో అధికారులు కీలకమైన పత్రాలు, లావాదేవీల రికార్డులు, ఫైళ్లు, బ్యాంక్ పాస్‌బుక్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల మూలం, లావాదేవీల తీరుపై ఏసీబీ లోతైన దర్యాప్తు చేపట్టింది.
Read also : ఛీ… ఛీ… మనిషేనా?.. మైనర్ బాలికను రూ.10 లక్షలకు అమ్మేసిన కన్నతల్లి!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రామారావును కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కస్టడీలో విచారణ జరిపితే మరిన్ని కీలక వ్యక్తులు, లావాదేవీల నెట్‌వర్క్ బహిర్గతం అయ్యే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు సూచిస్తున్నాయి. అధికార పీఠాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లలో అక్రమ సంపాదన చేసిన ఈ ఘటనపై దర్యాప్తు మరింత వేగవంతం కానుంది అని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. యాదగిరిగుట్టలో ఈ అవినీతి కేసు వెలుగులోకి రావడంతో దేవస్థానం పనితీరుపై ప్రజల్లో తీవ్ర చర్చ మొదలైంది.
Read also : తెలంగాణ మంత్రిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
 
				 
					
 
						 
						




