తెలంగాణ

నారాయణపురం ఎస్సీ హాస్టల్లో కలెక్టర్ నిద్ర…

క్రైమ్ మిర్రర్, యదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు మరోసారి ఆదర్శంగా నిలిచారు. సంక్షేమ హాస్టల్ లో రాత్రి నిద్ర చేశారు.విద్యార్థులతో ముచ్చటించి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని హాస్టల్ ను పరిశీలించారు కలెక్టర్ హనుమంతరావు. విద్యార్థులను పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాళ్లకు అందిస్తున్న భోజనం, రోజువారి దినచర్య గురించి ఆరా తీశారు. హాస్టల్ పరిసరాలు, వంటగది, భోజనం తయారీ చేసే విధానాన్ని స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలు విని, సలహాలు ఇచ్చారు. రాత్రికి హాస్టల్లోనే నిద్ర చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు.

ఇవి కూడా చదవండి :

  1. గ్రామస్థాయి రెవెన్యూ అధికారి (వీఎల్‌వో) పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..
  2. బన్నీకి బెయిల్ ఇవ్వొద్దు అంటూ కోర్టును కోరిన పోలీసులు!
  3. శుభవార్త అందించిన టీటీడీ బోర్డు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి
  4. మద్యం ప్రియులకు పండగే.. పండగ… వైన్స్‌ షాపులు, బార్‌ల సమయ వేళలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
  5. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button