ప్రైవేట్ హాస్పిటల్స్ అమానుషం మరోసారి బయటపడింది. కాసుల కక్కుర్తి కోసం ఓ నిండు ప్రాణం బలైంది. డబ్బులు కట్టలేదని చికిత్స నిలిపివేయడంతో మంచంపైనే విలవిలలాడి ప్రాణాలు వదిలాడు ఓ పేషెంట్. హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ లో ఈ దారుణం జరిగింది.
అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు మూడులక్షలకు పైగా డబ్బు కట్టిన కుటుంబీకులు. మిగతా 4లక్షలు కడితేనే డెడ్ బాడీ ఇస్తానంటున్నాయి ఆస్పత్రి వర్గాలు. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చెప్పిన వినలేదు. అర్ధరాత్రి మరో మూడు లక్షలు కట్టాలని లేదంటే వైద్యం ఆపేస్తామంటూ కుటుంబీకులకు ఫోన్ కాల్ చేశారు హాస్పిటల్ సిబ్బంది.ఉదయాన్నే లక్ష కట్టిన తరువాత పేషంట్ మృతి చెందారని చెప్పారు. మిగతా డబ్బు అంటూ బేరం పెట్టారు మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది.
డబ్బులు కట్టలేదని రాత్రే ట్రీట్ మెంట్ ఆపేశారని.. వైద్యం ఆపేయడం వల్లే నాగప్రియ చనిపోయిందని ఆరోపిస్తున్నారు బంధువులు. చనిపోయాకే తమతో లక్ష రూపాయలు కట్టించుకున్నారని చెబుతున్నారు. డబ్బులు ఆలస్యం అయితే ట్రీట్ మెంట్ ఆపేస్తారా అని నిలదీస్తున్నారు. నాగప్రియ బంధువల ఆందోళనతో మెడికవర్ ఆస్పత్రి వద్ద టెన్షన్ నెలకొంది.
మరిన్ని వార్తలు చదవండి …
ట్రంప్‌కే అమెరికా పగ్గాలు.. భారతీయులకు పండగే!
వైఎస్ భారతీ పీఏ అరెస్ట్.. నెక్స్ట్ ఎవరంటే..?
వైఎస్ భారతీ పీఏ అరెస్ట్.. నెక్స్ట్ ఎవరంటే..?
డీఎస్సీ అభ్యర్థులకు షాక్… వాయిదా పడిన పోస్టులు?