
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఐపీఎల్ 18వ సీజన్లో ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు జరగగా కేవలం మొదటి మ్యాచ్ లోనే గెలిచి మిగతా మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. అయితే జట్టు ఓటమికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే ప్రత్యర్ధులలో వణుకు పుట్టేది. కానీ ఇప్పటి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా సులువుగా మారిపోయింది. ఈ సంవత్సరం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపినర్లు ఒక్కరు కూడా సరిగా ఆడడం లేదు. ఒక ఓపినర్లే కాకుండా మిడిల్ ఆర్డర్ అలాగే ఫినిషింగ్ కూడా సరిగా లేదు. చూడడానికి బ్యాట్స్మెన్లు చాలా మంది ఉన్నా కానీ ఒక్కరు కూడా మంచి ఫామ్ను చూపించడం లేదు.
ఇక బెస్ట్ ఫినిషరుగా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని ఈ సంవత్సరం ఘోరంగా విఫలమవుతున్నాడు. సీఎస్కే జట్టు బెస్ట్ ఫినిషర్ మహేంద్రసింగ్ ధోని కాదు… అతని జట్టుకి మెయిన్ విలనని ప్రతి ఒక్కరూ అంటున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ రిటర్మెంట్ ప్రకటించాలని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. బాగా ఈ సంవత్సరం మహేంద్రసింగ్ ధోని మరియు విజయ శంకర్ మాత్రం టి20 లలో కూడా టెస్ట్ బ్యాటింగ్ చేస్తూ ప్రతి ఒక్కరికి చిరాకు తెప్పిస్తున్నారు. నిన్నటి మ్యాచ్లో ధోని మొదటి మొదటి బౌండు రీని కొట్టడానికి ఏకంగా 19 బంతులను తీసుకున్నాడు. దీంతో హోమ్ గ్రౌండ్ లో ప్రేక్షకులకు విజయశంకర్ అలాగే మహేంద్రసింగ్ ధోని చిరాకు తెప్పించారు. వెంటనే మహేంద్రసింగ్ ధోని కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని చాలామంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులే కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా ఒక మ్యాచ్ అయితే సరి పెట్టుకోవచ్చు కానీ ప్రతి మ్యాచ్ లోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాట్స్మెన్లు చాలా నెమ్మదిగా ఆడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.