
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్ని కూడా తమకు ఒక అవకాశంగా మలచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాలా మంది తమకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తుంటారు. తమ స్టేట్‌సతోపాటు తాము ఏం చేస్తున్నదీ, ఎక్కడికి వెళ్తున్నదీ వంటివి మెసేజ్‌లు పెడుతుంటారు. ఇలాంటి వాటిని నేరగాళ్లు తమకు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉందని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలంటున్నారు. వ్యూస్, లైక్స్ కోసం దినచర్యను పోస్ట్ చేయవద్దని, ముఖ్యంగా ఊరెళ్తున్నామంటూ పోస్ట్‌లు చేయడం యమ డేంజర్ అంటూ ‘ఎక్స్’ ద్వారా పోలీసులు సూచిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్ లలో వ్యూస్ కోసం హోంటూర్స్ (ఇంటిని చూపించడం) చేయవద్దని, సోషల్ మీడియాలో ఇంటి చిరునామాను బహిర్గతం చేయవద్దని పోలీసులు పేర్కొంటున్నారు.