
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :-
రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజులపాటు మన భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రజలందరూ కూడా అతనికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా భారత్ మరియు రష్యా దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండడానికి ప్రధాన కారణం ఇరుదేశాల అధ్యక్షులు. ఒకవైపు మోడీ మరో వైపు పుతిన్ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉన్న విషయం ఎన్నో సందర్భాలలో చూస్తూనే ఉన్నాం. వారి స్నేహం తోనే ఇరుదేశాల మధ్య కూడా మంచి సంబంధాలతోపాటు.. యుద్ధం పరంగా బలంగా కూడా ఉంటున్నాం.
Read also : రజనీకాంత్ ను వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత మృతి..!
ఇక ఈరోజు రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీ చేరుకొని ప్రధానమంత్రి మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవం వందనం కూడా పుతిన్ స్వీకరించనున్నారు. ఆ తరువాతనే ప్రత్యేకంగా మోడీ మరియు పుతిన్ మధ్య కీలక భేటీ జరగనుంది అని సమాచారం. కాగా పుతిన్ చివరిసారిగా 2021లో మన భారతదేశానికి వచ్చారు. మళ్లీ నాలుగు సంవత్సరాలు తరువాత మళ్లీ మనదేశంలో పుతిన్ అడుగు పెడుతున్న సందర్భంలో ఇప్పటికే వారణాసిలో ఆయన ఫోటోకు పలువురు మహిళలు హారతులు కూడా ఇస్తున్నారు. ఇంకొంతమంది ఇరు దేశాల మధ్య స్నేహం జిందాబాద్ అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించారు. ప్రపంచంలోనే మోడీ మరియు పుట్టిన ఇద్దరు కూడా గొప్ప లీడర్లు అంటూ నినాదాలు చేస్తున్నారు.
Read also : ఏపీలో నేడు కూడా భారీ వర్షాలు..!





