
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళల కోసం ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని చాలా ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలందరూ కూడా రాష్ట్రంలో ఏ వైపు ప్రయాణం చేయాలన్నా కూడా మొత్తం ఫ్రీ యే అని చెప్పారు. అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం పట్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని చాలామంది సరదా కోసం వినియోగిస్తూ ఉన్నారని.. మరి కొంతమంది ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలిగే అవకాశం ఉందని అంటున్నారు.
Read also : తెలంగాణ రైతులకు ఊరట.. యూరియా కేటాయింపు!
అయితే తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఒక మహిళ సరదా కోసం ఒక వీడియోని తీసి దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ బస్సు పథకం పై నవ్వులు పూయిస్తున్నారు. అసలేం జరిగిందంటే… అనంతపురం జిల్లాకు చెందిన ఒక మహిళ… ” మా అమ్మకు ఇష్టమైన కట్లపొడి, ఆకులు, వంట సామాగ్రికి సంబంధించినటువంటి కొన్ని పదార్థాలను తీసుకురావడానికి ఫ్రీగా తాడిపత్రి నుంచి అనంతపురానికి వెళ్తున్నాను” అని ఒక రీల్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో సరదా కోసం కాకుండా కేవలం అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్రీగా వస్తుంది అని ఎలా పడితే అలా ఉపయోగించకూడదు అని ఇంట్లోని పురుషులే మహిళలకు తెలిసేలా నచ్చ చెప్పాలి అని… ఇలాంటి వాళ్ల వల్ల నిజంగా అవసరం ఉన్నవాళ్లు ఇబ్బందులు పడతారని అంటున్నారు.
Read also: వైన్ షాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్