
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ కూడా ఆసక్తిగా మారుతున్నాయి. ప్రతిరోజు ఇరు పార్టీల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రాజకీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు . పార్టీల పరంగా విమర్శలు చేయాలి కానీ ఇలా దొంగచాటుగా దివంగత నేతల విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. విగ్రహాల జోలికి వస్తే తాట తీసి వదిలిపెడతా అని విపక్ష పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా కృష్ణా జిల్లాలోని కైకలూరులో కాపు నాయకుడు అయినటువంటి వంగవీటి రంగ విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు కూల్చేశారు. ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిందితులను 24 గంటల్లోపు గుర్తించాలని పోలీసులను ఆదేశించారు.
Read also : రెచ్చిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి!
ఈ దుండగులు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా అసలు వదిలి పెట్టకూడదని తెలిపారు. రాష్ట్రంలోని ఏ నేతల విగ్రహాలను అయినా సరే అవమానించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించి… మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడ పర్యటనకు వెళ్లిపోయారు. ప్రతి నెలలో చివరి శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లాలో పర్యటించారు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని కేంద్రం ఇటీవల కాలంలో నిరూపించింది.
Read also : బీహార్ ఓటర్ లిస్టులో పాకిస్తానీల పేర్లు, విచారణకు ఆదేశం!