క్రైమ్తెలంగాణ

పాత సెల్ ఫోన్లుకు స్టీల్ సామాన్లు ఇస్తామమ్మా… తెలంగాణలో సరికొత్త మోసగాళ్లు?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. కొత్త కొత్త పద్ధతులతో ప్రతి రోజు కూడా ఈ సైబర్ నేరగాళ్లు అప్డేట్ అవుతూ వస్తున్నారు. దీనిపై ప్రజలకు ఉన్నతాధికారులు ఎంతల వివరించినా కూడా ఏదో ఒక సందర్భంలో చాలామంది మోసపోతున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా సైబర్ నేరగాళ్లు మరొక కొత్త పద్ధతి ద్వారా నేరాలకు పాల్పడుతున్నట్లుగా తెలంగాణ పోలీస్ అధికారులు తెలిపారు. ఈమధ్య చాలామంది పాత ఫోన్లకు ప్లాస్టిక్ లేదా స్టీల్ సామాన్లు ఇస్తామంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి మీ పాత మొబైల్ ఫోన్స్ అమ్మారు అంటే ఖచ్చితంగా చిక్కుల్లో పడ్డట్లే అని పోలీసు అధికారులు వెల్లడించారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా లో పాత ఫోన్లను తీసుకొని సరికొత్త నేరాలకు పాల్పడుతున్నటువంటి ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మీ నుండి కొనుగోలు చేసినటువంటి పాత ఫోన్ల ద్వారానే ఓటీపీలు అలాగే మెసేజ్లు అనేవి ఇతరులకు పంపి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారంటూ పోలీసులు వివరించారు. ఒకవేళ వారు పోలీసులకు దొరికిన ఆ పాత మొబైల్స్ లోని సిమ్ కార్డులు మీ పేరు మీదే ఉండడంతో మీరే చిక్కుల్లో పడాల్సి వస్తుంది అని పోలీసులు హెచ్చరించారు. ఈ మధ్య వరుసగా ఇలాంటి ముఠాలు రెండు చోట్ల పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కాబట్టి సైబర్ నేరగాళ్లు ప్రతిరోజు కూడా వేరువేరు పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని అదిలాబాద్ పోలీసులు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు అనేవి విదృతంగా జరుగుతున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఓటీపీలు, మెసేజ్లు ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దని.. అలాగే ఎవరి మీదనైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు.

Read also : యూధులకే ఎక్కువ నోబెల్ అవార్డులు.. కారణం ఏంటి?

Read also : బ్రేకింగ్ న్యూస్.. క్యాన్సర్ లక్షణాలు ఇవే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button