
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఈ ఏడాది నోబుల్ పురస్కారం దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 యుద్ధాలు ఆపాను అని.. తనకంటే నోబల్ శాంతి అవార్డుకు అర్హుడు మరొకరు లేరు అంటూ ఒక మినీ సైజు యుద్దాన్ని చేసిన ట్రంప్ కు 2025 నోబుల్ శాంతి పురస్కారం దక్కలేదు. ఇజ్రాయిల్ మరియు పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఆయన్ను ఈ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేయగా ఉపయోగం లేకుండా పోయింది. కేవలం గడువులోగా నామినేషన్లు రాకపోవడంతోనే ట్రంప్ పేరును నోబెల్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జనవరి 31వ తేదీలోపు గడువు ఉండడంతో 2026 రేసులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో 2026 లోనైనా నోబల్ శాంతి పురస్కారం డోనాల్డ్ ట్రంప్ కు దక్కుతుందా లేదా అని మళ్లీ ఈ విషయం తెరపైకి వచ్చింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై తీవ్రంగా చర్చిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డోనాల్డ్ ట్రంప్ను వచ్చే ఏడాది కాదు కదా.. బతికున్నంత కాలం రాదు అని సెటైర్లు వేస్తున్నారు.
Read also : ఖమ్మం మంత్రులపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే
Read also : <a style="color:red" href=”https://crimemirror.com/wars-wouldnt-stop-if-tariffs-werent-imposed-i-have-the-power-to-stop-wars-trump/”>టారిఫ్స్ విధించకపోతే యుద్ధాలు ఆగేవి కాదు.. యుద్ధాలను ఆపగలిగే శక్తి నాకే ఉంది : ట్రంప్