
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉత్కంఠత ఉంటుంది. 2024లో ఎన్నికలు జరిగి సంవత్సరం అయిపోయినా కూడా ప్రజలకు మరియు రాజకీయ నాయకులకు రాబోయే ఎన్నికల మీద మరింత ఎక్కువగానే ఆసక్తి పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. సీఎంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటినుంచి భవిష్యత్తుపై కూడా ఆలోచనలు చేస్తూనే మంత్రులను అలాగే ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు కంట్రోల్ లో ఉంచుతూ అభివృద్ధిపై ఫోకస్ చేయమని హెచ్చరిస్తూ ఉన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయంగా చాలా నైపుణ్యం గల వ్యక్తి. ఇప్పటివరకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించినా కూడా చంద్రబాబును కూడా ఒక భయం వెంటాడుతుంది. అదేంటంటే… మన రాష్ట్రంలో ఎవరు కూడా వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన దాఖలు లేవు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి ప్రభుత్వాన్ని చేపట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. మళ్లీ 2024లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని బట్టి గత రికార్డులను పరిశీలిస్తే 2029 ఎలక్షన్లలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read also : కౌంటర్ ఇవ్వబోయి ఎక్స్ ట్రాలు మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి?
ఇది ఆలోచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై చాలానే ఆరా తీస్తున్నారు. రాజకీయాల్లో వైకుంఠపాళీ ఆడ వద్దని ప్రజలకు వివరించారు. అంటే ఒక పార్టీకి స్థిరంగా అధికారం ఇస్తేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి అవుతుంది అని… ఎలక్షన్, ఎలక్షన్ కు వేరువేరు పార్టీలకు అవకాశాలు ఇస్తూ పోతే రాష్ట్రం అభివృద్ధి కాదు అని వివరిస్తూ వస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం గురించి లోతుగా ఆలోచించారు కాబట్టే నేడు ప్రజలకు ఇలా చాకచక్యంగా వివరిస్తున్నారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకోవడానికి ఎన్నెన్నో చెప్తారు.. అవన్నీ కూడా నమ్మి ఓట్లు వేయొద్దు అని ప్రజలకు సూచిస్తూ వస్తున్నారు. మరోవైపు వైసీపీ పార్టీ అభిమానులు కూడా 2029 లో మా పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణలో అయితే ఏ పార్టీ అయినా కూడా రెండుసార్లు గెలుస్తూ వస్తుంది. దీంతో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడుతుంది చాలామంది భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఇలానే జరుగుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. మరోవైపు ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఈ విషయం గురించి చర్చిస్తూ ఉన్నారు.