తెలంగాణ

మల్లీ అదే పొరపాటు చేస్తుందా ప్రభుత్వం..!?

హైదరాబాద్, (క్రైమ్ మిర్రర్): మొన్న లగచర్ల, నిన్న దిలావర్ పూర్, ఇవ్వాళ కంచ గచ్చిబౌలి భూముల విషయాలలో వరుస వివాదం.. ఇలా వరుస ఘటనల్లో కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ మూడు ఘటనల వెనుక కాంగ్రెస్ పెద్దల మౌనమే ప్రధాన కారణమా..? లేక ప్రతిపక్షల హస్తముందా..? లేక కాంగ్రెస్ అగ్ర నేతలు సరైన సమయంలో స్పందించకపోవడమా అనేది చర్చగా మారింది..!? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనాపరంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో, అనుకోని అవాంతరాలు ఎదురవుతూనే వస్తున్నాయి.. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లగచర్ల, దిలావర్ పూర్, కంచ గచ్చిబౌలి రగడ అనే చెప్పుకోవాలి.. వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతులు జిల్లా కలెక్టర్‌పై తిరగబడడం అప్పట్లో సంచలనం రేపింది.

లగచర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టిన రేవంత్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. రైతులు, స్థానికులతో పాటు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తడంతో అప్పటి ఉద్రిక్తతను బట్టి ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు.. అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇది తమ విజయమని బీఆర్ఎస్ చెప్పుకుంటూ వచ్చింది.. లగచర్లలో రైతుల నుంచి సేకరించిన భూముల్లో మొత్తం ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని ముందు చెప్పకపోవడం కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పిదమంటూ పొలిటికల్‌ వర్గాలు భావిస్తున్నాయి..!? ముందే రైతులకు ప్రభుత్వం విడమర్చి చెప్పి ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదని అప్పట్లో చర్చ జరిగింది. ఈ పనేదో ముందే చేసి ఉంటే బాగుండేది కదా..?


Also Read : భూములు అమ్మితే ఒప్పుకోం.. రేవంత్ కు సీపీఐ ఝలక్ 


ఇక దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ఆర్డీవో మీద దాడిచేసే దాకా వెళ్ళింది అందరికి తెలిసినదే..!? ఈ వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనకి దిగింది.. ఐతే ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నది అసలు విషయమని నిపుణులకు తెలిసినదే..!? దీనిపై ప్రభుత్వం ముందుగా క్లారిటీ ఇవ్వకపోవడం.. మంత్రి సీతక్క రంగంలోకి దిగే వరకు కూడా అసలు విషయం బయటకు రావకపోవడం ప్రభుత్వం ప్లాన్ గా లేకపోవడమే అంటున్నారు అనుభవజ్ఞ్యులు..!? ఈ పనేదో ముందే చేసి ఉంటే రైతుల్లో అంత వ్యతిరేకత వచ్చి రోడ్డెక్కేవాళ్ళు కాదనే అభిప్రాయం వ్యక్తవుతోంది.. ఇక ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పొరపాటు చేసిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.


Also Read : సొంతగడ్డలో కేసీఆర్ బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి దుబ్బాక ఎమ్మెల్యే జంప్?


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది.. అక్కడ లేఅవుట్‌ను అభివృద్ధి చేసి ఐటీ, ఇండస్ట్రీయల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐతే రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, హెచ్‌సీయూ విద్యార్థులు పెద్ద ఎత్తున గళం విప్పారు. ఆ తర్వాత ప్రతిపక్షపార్టీలు, పర్యావరణవేత్తలు, సినీరంగ ప్రముఖులు ఎంటరయ్యారు.. అభివృద్ధి కోసం అడవుల్ని లేకుండా చేస్తారా అనే ప్రశ్నమొదలైంది.. పర్యావరణాన్ని నాశనం చేయవద్దనే వాదన అందరి నోట తెరపైకి వచ్చింది. విషయం హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ఇక దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీ సచివాలయంలోని పవన్ కల్యాణ్ బ్లాక్ లో మంటలు

  2. అకడమిక్ క్యాలెండర్ విడుదల… సెలవులు దినాలు ఎప్పుడంటే?..

  3. హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. మునిగిపోవడం ఖాయమా?

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button